ప్రజా సంక్షేమంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో అభివృద్ధి పనులపై చర్చించారు. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.