ఆస్ట్రేలియా నుంచి జపాన్‌కు బయలుదేరిన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ విమానంలోని స్క్రీన్లలో అభ్యంతరకర దృశ్యాలు ప్రసారం అయ్యాయి. అది ‘అడల్ట్ కంటెంట్’ కావడంతో ప్రయాణికుల్లో కొందరు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాటిని ఆఫ్ చేయలేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. దీంతో సాంకేతిక లోపం కారణంగానే అలా జరిగిందని విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.