మంగళగిరిలోని అరణ్య భవన్‌లో సోమవారం 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్‌ని నిర్మూలించాలన్నారు. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.