ఏపీలో పెరిగిన చలి తీవ్రత

69చూసినవారు
ఏపీలో పెరిగిన చలి తీవ్రత
ఏపీలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. ముఖ్యంగా అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఏజెన్సీ మొత్తం దట్టమైన పొగమంచు కప్పేసింది. ఆదివారం ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా అలముకుని కనిపించింది. అయితే వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మంచు పోయిన తరువాత కూడా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. అరకులోయలో ఆదివారం 5.9 డిగ్రీల మేర అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్