ప్రముఖ సినీ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూశారు. చెన్నైలో ఉంటున్న సోమవారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విజయ్ రంగరాజు అనేక సినిమాల్లో విలన్, సహాయక పాత్రలు వేసి మెప్పించారు. ముఖ్యంగా గోపిచంద్ హీరోగా చేసిన ‘యజ్ఞం’ మూవీలో విలన్‌గా యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.