ఏపీ మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ బదిలీ చేయడానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్లలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం జరిగింది. మరోసారి విచారణ ధర్మాసనంలో మార్పు చోటు చేసుకుంది. గతంలో విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం నుంచి.. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్పింది.