బాలికతో అసభ్య ప్రవర్తన.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ (వీడియో)

77చూసినవారు
తన ఇంట్లో పని చేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే తన ఇంట్లో పని చేసే బాలికతో అనుచితంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మహిళా సంఘాలు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు పెట్టారు. ఈ క్రమంలో కర్నూలు టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్