ఏపీలో ఈ సంక్రాంతికి చంద్రన్న కానుకలు లేనట్లేనని తెలుస్తోంది. చంద్రబాబు 3.O సర్కారులో ఏటా ఈ పథకం కోసం రూ.287 కోట్లు ఖర్చు చేసేవారు. చంద్రన్న కానుకలుగా ఆరు రకాల సరుకులను సరఫరా చేసేవారు. అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోవడంతో నెలనెల పింఛన్లు, జీతాలకే ప్రభుత్వం కటకటలాడాల్సి వస్తోంది. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి సరుకులు సరఫరా చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.