TS: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణించిన నేపథ్యంలో ఈ నెల 27న ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఆ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఈ క్రమంలో కొత్త తేదీలను అధికారులు ప్రకటించారు. పరీక్ష తేదీల కోసం www.osmania.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.