ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం తగదని మంత్రి డీబీవీ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 నెలల కూటమి పాలనలోనే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని మంత్రి వెల్లడించారు. నాడు పెట్టుబడులు తేలేనివారు ఇవాళ విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు.