తాటిబెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి తాటిబెల్లం చక్కని ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనిలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. తాటిబెల్లాన్ని మహిళలు తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.