సైఫ్‌పై దాడి.. పోలీస్‌ కస్టడీకి నిందితుడు

64చూసినవారు
సైఫ్‌పై దాడి.. పోలీస్‌ కస్టడీకి నిందితుడు
బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌‌పై దాడి కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లాంను పోలీసులు బాంద్రాలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. వాదోపవాదాలు విన్న కోర్టు 5 రోజులపాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. దీంతో అతడిని బాంద్రా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. జనవరి 29న మరోసారి న్యాయస్థానం విచారించనుంది. ఇక ఈ కేసును ఇతర కోణాల్లోనూ విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్