ప్రముఖ హాస్య నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి నౌరంగ్ యాదవ్ గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. అయితే, రాజ్‌పాల్ తన కుటుంబంతో కలిసి థాయ్లాండ్ ట్రిప్‌లో ఉండగా మరణవార్త తెలియడంతో ఢిల్లీకి హుటాహుటిన బయల్దేరారు.