ఇంగ్లండ్‌తో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడుతోంది. దాదాపు 14 నెలల తర్వాత మళ్ళీ జట్టులోకి వచ్చిన షమీ మోకాలిలో మళ్లీ స్వల్ప వాపు వచ్చిందని అందుకే అతడిని మొదటి మ్యాచ్‌లో ఆడించలేదనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో ఇలాంటి వాటికి ముగింపు పలకాలంటే షమీని ఆడించాలని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సూచించాడు. మేనేజ్‌మెంట్ చెబుతున్న కారణాలు సరిగ్గా లేవనిపిస్తోందని వ్యాఖ్యానించాడు.