వైసీపీ అధినేత జగన్‌ను జింబాబ్వే నియంత రాబర్ట్ ముగాబేగా పోల్చుతూ టీడీపీ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ‘ప్రజల సొమ్ముతో బ్లూ రూఫ్ మేన్షన్ కట్టుకుని రాబర్ట్ ముగాబే జింబాబ్వేని అప్పుల్లో ముంచాడు. ఆంధ్రా ముగాబేగా జగన్ చరిత్ర సృష్టించారు. తెచ్చిన అప్పుల్లో 12.85 కోట్లతో జగన్ చేయించిన ప్యాలెస్ ఫెన్సింగ్ ఎత్తు ముందు, ముగాబే మేన్షన్ ఫెన్సింగ్ కూడా దిగదుడుపే.’ అని టీడీపీ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.