2027 సీజన్ ముగిసేదాకా ఆస్ట్రేలియా పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్ డొనాల్డే కొనసాగుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. జస్టిన్ లాంగర్ తప్పుకోవడంతో 2022లో మెక్ డొనాల్డ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. మెక్ డొనాల్డ్ కోచింగ్‌లోనే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సాధించింది. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.