సీఎం జగన్‌కు షాకిచ్చిన వాలంటీర్లు

98978చూసినవారు
సీఎం జగన్‌కు షాకిచ్చిన వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు షాక్ తగిలింది. ఎన్డీయే నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అభ్యర్థి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో 40 మంది వాలంటీర్లు చేరారు. టీడీపీ కండువాలు కప్పి వేమిరెడ్డి దంపతులు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. విడవలూరు మండలం నుంచి వాలంటీర్లు రాజీనామా చేసి టీడీపీలో చేరారని వేమిరెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్