AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ నెలఖారు వరకు ఆయన లండన్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ విదేశీ టూర్ ముగిసి ఏపీకి చేరుకోగానే మొదట జిల్లాల పర్యటనకు సంబంధించిన ప్రణాళికను రూపొందించనున్నారని సమాచారం. జగన్ ఈ నెలఖారుకు ఏపీ వచ్చే అవకాశాలు ఉండటంతో ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.