ఎగ్జిట్ పోల్స్‌తో ప‌ని లేదంటున్న జ‌గ‌న్‌

58చూసినవారు
ఎగ్జిట్ పోల్స్‌తో ప‌ని లేదంటున్న జ‌గ‌న్‌
ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగించి అమరావతి చేరుకున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ ముఖ్య నేత‌ల‌తో జగన్ స‌మావేశ‌మై.. ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశార‌ని స‌మాచారం. సీఎం జగన్ గతంలో తాను చెప్పిన మాటలనే తిరిగి రిపీట్ చేసినట్లు వినికిడి. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పుకొచ్చారట‌. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాలతో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్