సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన అదిరిపోయే బహుమతి ఇవ్వనుంది. ఆ రోజున క్లీన్ ఆంధ్ర- గ్రీన్ ఆంధ్ర కాన్సెప్ట్‌తో కార్యక్రమాలను నిర్వహించనుంది. సమాజాన్ని ఎంతో ఇష్టపడే నాయకుడిగా, ప్రకృతిని అమితంగా ప్రేమించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ఆశయాలు మేరకు పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా క్లీన్ ఆంధ్ర- గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ తీసుకున్న కార్యక్రమంలో ప్రతి జనసైనికుడు, వీర మహిళలు పాల్గొని ఆయనకు స్వచ్ఛ హరితహారాన్ని బహుమతిగా అందిద్దామని నాగబాబు పిలుపునిచ్చారు.