AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే నేను ఉన్నా. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 28 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఏం చేయాలో తెలియక రెండు రోజులు బయటకు రాలేదు. కానీ మరో వ్యక్తి 90 వేల ఓట్ల తేడాతో ఓడిపోయేసరికి నాకు ధైర్యం వచ్చింది. 2014లో కేవలం 924 ఓట్ల తేడాతో ఓడిపోతేనే 6 నెలలు నిద్ర పట్టలేదు. మొన్న బాగా నిద్రపట్టింది. ఏం చేసినా గెలిచే వాళ్లం కాదని తెలిసిపోయింది' అని అన్నారు.