చలికాలంలో ఉష్ణోగ్రత పడిపోవడంతో శరీరం కండరాలు, సిరలలో రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీంతో సిరల్లో నొప్పి, వాపు సమస్యలు వస్తాయి. విటమిన్ల లోపం వల్ల నరాల నొప్పి వస్తుంది. బీట్‌రూట్, పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల నరాల బలహీనతను తొలగిస్తుంది. ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్త కణాలను తయారు చేయడానికి విటమిన్ బీ12 అవసరం. మాంసాహారం, పాలు వంటివి ఈ లోపాన్ని అధిగమిస్తాయి.