ఏపీ సీఎం చంద్రబాబు మరోమారు పోలవరం పర్యటనకు వెళుతున్నారు. డిసెంబర్ 16న ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జూన్ 17న పోలవరం వెళ్లారు. రేపు మరోసారి సందర్శించి డయాఫ్రం వాల్ నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.