తమిళనాడులో దారుణ ఘటన జరిగింది. జాన్ అనే రౌడీ షీటర్‌ని కొందరు నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు. సేలం నివాసి అయిన జాన్, తన భార్యతో కలిసి సిద్ధోడు సమీపంలో కారులో ప్రయాణిస్తుండగా ఈ దారుణ సంఘటన జరిగింది. 8 మంది వ్యక్తులు జాన్ కారును అడ్డుకుని, అతన్ని నరికి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.