సగ్గుబియ్యం తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సగ్గుబియ్యంలో పిండిపదార్థాలు, పౌష్టికపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీరం నీరసంగా ఉన్నప్పుడు సగ్గుబియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది. ఇంకా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.