యూపీలో ప్రియుడితో కలిసి భర్తను ముక్కలుగా నరికిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిందితురాలి తల్లిదండ్రులు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత దారుణానికి పాల్పడిన తమ కూతురిని ఉరి తియ్యాలని, ఈ విషయంలో తమ కూతురికి ఏవిధంగా మద్దతు తెలుపమని చెప్పారు. అల్లుడు సౌరభ్.. ముస్కాన్‌ను ఎంతగానో ప్రేమించాడని, కానీ డ్రగ్స్‌కు బానిసై ఈ దారుణానికి పాాల్పడినట్లు వెల్లడించారు.