బద్వేల్ పట్టణంలో ఉన్న శివాలయం కుంటను ఆక్రమించి లక్షలలో సొమ్ము చేసుకుంటున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఎం బద్వేల్ పట్టణ నాయకుడు ముడియం చిన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం నాయకులతో కలిసి ఆయన ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.