గుడ్‌న్యూస్.. ఇకపై వారి అకౌంట్లో పింఛన్ డబ్బులు!

79చూసినవారు
గుడ్‌న్యూస్.. ఇకపై వారి అకౌంట్లో పింఛన్ డబ్బులు!
AP: పింఛన్ పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ, దివ్యాంగ విద్యార్థులకు డబ్బును బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. వృద్ధులకు డిజిటల్ సీనియర్ సిటిజన్ కార్డులు అందించనుంది. ఇప్పటి వరకు ప్రతి నెలా 1వ తేదీన లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేస్తుండగా, ఇకపై దివ్యాంగ కోటాలో పింఛన్ పొందుతున్న విద్యార్థులకు డబ్బును బ్యాంక్ ఖాతాలోనే జమ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ విధానాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్