ఏపీలో ఉగాది నుంచి 'మార్గద‌ర్శి బంగారు కుటుంబం'

61చూసినవారు
ఏపీలో ఉగాది నుంచి 'మార్గద‌ర్శి బంగారు కుటుంబం'
ఏపీలో ఉగాది పండ‌గ రోజున సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 'మార్గద‌ర్శి బంగారు కుటుంబం' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించ‌బోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యద‌ర్శి పీయూష్ కుమార్ తెలిపారు. స‌మాజంలో ఉన్నతంగా ఉన్న 10 శాతం సంప‌న్న వ‌ర్గాలు అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేద కుటుంబాల‌ను ఆదుకుని వారి అభ్యున్నతి కొర‌కు స్వచ్చందంగా ముందుకొచ్చే వారి కోసం రూపొందించిన కార్యక్రమమే ఈ మార్గద‌ర్శి బంగారు కుటుంబం అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్