మనం ఫోన్ కాల్ చేయగానే డిజిటల్ మోసాలపై అవగాహన కల్పిస్తూ ఓ వాయిస్ మనకు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇది మంచి సమాచారాన్ని అందించినా పదే పదే వినడం చాలా మందికి చిరాకుగా ఉంటుంది. కాగా ఆ గొంతు శ్రీ శరణ్ అనే వ్యక్తిదని RJ అమృత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నార్మల్, కాల్లో వచ్చే వాయిస్ రెండింటినీ ఆయన వినిపించారు. దీనికి కొందరు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.