గండికోట నగరవనంను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కడప జిల్లాలోని ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశం గండికోటలో నగరవనం, మైలవరం జలాశయంలో బోటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. ఈ మేరకు గండికోటలో ఏర్పాటు చేయబోయే నగరవనం స్థల పరిశీలనతోపాటు. మైలవరం జలాశయంలో బోటింగ్ ను శనివారం ఆయన పరిశీలించారు. బోట్ ఎక్కి ఎంత దూరం ప్రజలకు సౌకర్యవంతంగా తిప్పగలరు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు.