AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం అత్యధికంగా నంద్యాల జిల్లా రుద్రవరంలో 41.6, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.1, నెల్లూరు జిల్లా సోమశిలలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. బుధవారం 108 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. విజయనగరం 21, శ్రీకాకుళం 15, తూ.గో 13, మన్యం 10, అల్లూరి 8, పల్నాడు 8, అనకాపల్లి 7 తదితర జిల్లాల్లో వడగాలులు వీస్తాయంది.