పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా రక్తదాన శిబిరం

77చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని డిఎస్పీ రమాకాంత్, అర్బన్ సీఐ లింగప్ప, రూరల్ సీఐ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఉచిత రక్తదానంలో పోలీసులు, యువకులు పాల్గొన్నారు. డియస్పి రమాకాంత్ మాట్లాడుతూ, రక్తదానం ద్వారా అనేక మందికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం నేటి సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్