కొండాపురం మండలంలోని ఓబన్నపేట నాలుగు వరసల రహదారిలో మంగళవారం రాత్రి కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల మేరకు కారు ముద్దనూరు వైపు నుంచి తాడపత్రి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.