ఎర్రగుంట్ల: విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం తగదు

65చూసినవారు
ఎర్రగుంట్ల: విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం తగదు
విద్యుత్ సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడంలో విద్యుత్ సిబ్బంది జాప్యం చేయరాదని ఏపీఏఎస్ పీడీసీల్ పర్యవేక్షణ అధికారి వెంకటరమణ తెలిపారు. మంగళవారం ఎర్రగుంట్లలో విద్యుత్ సబ్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యుత్ శాఖ అధికారులతో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. విద్యుత్ సబ్ స్టేషన్ల వారిగా వస్తున్న సమస్యలన్నింటినీ ఆయా విభాగ అధికారులు పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు.

సంబంధిత పోస్ట్