రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అక్షయపాత్ర యాజమాన్యం నాసిరకం భోజనం పెడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ అన్నారు. బుధవారం ఎర్రగుంట్లలో వారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ భోజనాన్ని పరిశీలించగా నాసిరకం భోజనం సప్లై చేస్తున్నారన్నారు. మున్సిపల్ అధికారులు అక్షయపాత్ర కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.