త్వరలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఎర్రగుంట్లలోని ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో మంగళవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో శోభన్ బాబు ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులకు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.