కడప జిల్లా ముద్దనూరు మండలం యామవరం రైతు సేవా కేంద్రంలో.. శనివారం వ్యవసాయ అధికారులు రైతులకు ఉచితంగా యన్డియస్ హెచ్ 1012 రకం మినికిట్స్ చిరు సంచుల పథకం క్రింద రైతులకు ప్రొద్దు తిరుగుడు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రైతుకు ఒక్కొక్క ప్యాకెట్ చొప్పున 50 ప్యాకెట్లను, 50 మంది రైతులకు ఉచితంగా ప్రొద్దుతిరుగుడు విత్తనాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.