వ్యాధి నిరోధక టీకాలు పిల్లలకు తప్పనిసరి

379చూసినవారు
వ్యాధి నిరోధక టీకాలు పిల్లలకు తప్పనిసరి
తల్లిదండ్రులలో వ్యాక్సిన్ల గురించి అర్థం లేని భయాలు అనేకం ఉంటాయని, భయాలు అపోహలు విడనాడి డాక్టరు చెప్పినట్లుగా పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తేనే వాళ్ల భవిష్యత్తు భవ్యంగా ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శాంతి కల పేర్కొన్నారు. ఎర్రగుంట్ల, పొట్లదుర్తిలో గల సచివాలయాల్లో శనివారం డాక్టర్‌ శాంతి కల అధ్యక్షతన జరిగిన ఆరోగ్య సదస్సులో వ్యాధి నిరోధక టీకాలు ప్రాముఖ్యత అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలన్నారు. ఒక నెలలో 3 - 4 వ్యాక్సిన్లు వేసినప్పటికి రెండవ డోసుకి కనీసం 4 వారాలు గ్యాప్‌ ఉండాలని అన్నారు.


చిన్నపాటి అనారోగ్యాలు పౌష్టికాహార లోపాలు ఉన్నప్పటికి వ్యాక్సిన్‌ వేయవచ్చని అన్నారు. వ్యాక్సిన్‌ విషయంలో వేయవలసిన మోతాదు మాత్రం కరెక్ట్‌గా వేయాలన్నారు. పిల్లలకు ఏఏ వ్యాక్సిన్లు ఏ వయసులో వేయాలో పూర్తి చిట్టా ఉందని, ఆ ప్రకారంగానే తప్పకుండా వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జోష్ణ హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ ఓబులేసు, లక్ష్మీదేవి, సిహెచ్ఓ ప్రశాంత్ ఏఎన్ఎం అనిత ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్