కొండాపురం మండల పరిధిలో గతరెండు రోజులుగా వర్షం ఆగకుండా పడుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొండాపురం సిఐ మహమ్మద్ రఫీ తెలిపారు. మండలంలోని వాగులు, వంకలు, చెరువులు, గండికోట వెనుక జలాలలోకి ప్రజలు ఎవరు వెళ్లకుండా ఉండాలని సూచించారు. తడిసిన విద్యుత్ స్తంభాలను తాకరాదని అన్నారు. అజాగ్రత్తగా వ్యవహారిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సీఐ అన్నారు.