చెన్నూరులో వైభవంగా కన్యక పూజ

70చూసినవారు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని చెన్నూరు మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ( అమ్మవారి శాల) శుక్రవారం బాలికలకు కన్యక పూజను నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం హోమాలు చేపట్టారు. అనంతరం బాలికలను కన్యకగా భావించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్