పెండ్లిమర్రి మండలం పొలతల పుణ్యక్షేత్రంలో ఆలయ చైర్మన్ నాగమల్లారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి దంపతులు ముఖ్యఅతిథిగా హాజరై కళ్యాణాన్ని వీక్షించారు. కార్తీకమాస మూడవ సోమవారం సందర్భంగా పొలతల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి భారీగా భక్తులు వచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు.