ఈతకు వెళ్లి బాలుడు మృతి

1052చూసినవారు
ఈతకు వెళ్లి బాలుడు మృతి
వీరపునాయునిపల్లె మండలం సంగమేశ్వర ఆలయాల సమీపంలోని సంగాలమడుగులో పడి తాటిమాకులపల్లెకు చెందిన తనుకా సంజయ్ కుమార్ (13) అనే బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం సంజయ్ కుమార్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సంగాలమడుగులో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. నీటిలో మునిగిపోతున్న మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్