కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెండ్లిమర్రి మండల పరిధిలోని కొండూరు గ్రామంలో మణికంఠ అనే యువకుడు శుక్రవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తూ షాక్‌కు గురై చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేశారు.