నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం గా చేయాలని కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మైదుకూరు పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మూడవ తరం నాయకుడిగా లోకేష్ బాబు ఉన్నారని ఆయనను డిప్యూటీ సీఎంగా చేస్తే నేటి యువతకు భరోసా ఇచ్చినట్లు అవుతుందన్నారు. యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.