మైదుకూరు మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా మైదుకూరు నియోజకవర్గంలోని క్రైస్తవ మందిరాలన్నీ మంగళవారం రాత్రి విద్యుద్దీపలంకరణలతో వెలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చిల ముందు భారీ క్రిస్మస్ స్టార్లు, క్రీస్తు పశువుల పాకలో పుట్టిన సందర్భాన్ని తెలిపేలా రూపొందించిన అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో నేటి రాత్రి నుంచి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు మొదలుకానున్నాయి.