ప్రొద్దుటూరులో గోవా మద్యం పట్టివేత

63చూసినవారు
ప్రొద్దుటూరులో గోవా మద్యం పట్టివేత
ప్రొద్దుటూరులో దసరా పండుగ కోసం అక్రమంగా తెచ్చి నిల్వ చేసిన గోవా మద్యం బాటిల్లను పెద్ద మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. వివిధ బ్రాండ్ల మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముకోవడానికి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని గురువయ్య తోటలోని ఓ ఇంటిలో అక్రమ మద్యం నిల్వ చేసినట్లు శనివారం రాత్రి పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేసి 816 ఫుల్ బాటిళ్లు, 2 లీటర్ల బాటిళ్లు 10 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్