కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో ఈ నెల 10న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, జమ్మలమడుగులోని న్యాక్ కేంద్రంలో జరిగే మేళాకు పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన యువత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.