పాడి రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామంలో శనివారం మినీ గోకులం షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నిర్మించిన పశువుల పెంపకం షెడ్డును నిర్మించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, బచ్చల వీరప్రతాప్ పాల్గొన్నారు.