ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలోని సుందరయ్య కాలనిలో స్మశానవాటిక ఆదునీకరణకు వెచ్చించిన రూ. 47 లక్షల నిధులను సర్పంచ్ శివచంద్రారెడ్డి స్వాహా చేశారని మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మంగళవారం డిఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. సుందరయ్యకాలనీలోని స్థలాన్ని పరిశీలించాలని వైసీపీ నాయకులు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.